Thursday, May 4, 2017

Support Grama Bharathi


Support a Child : Rs. 15,000/- p.a.
Support a childs Education: Rs. 3,000/- p.a.
Food expense per day all kids : Rs. 1500/- p.a. 

Grama bharathi - Regd No: 3397/96

Adm Off: 

3-2-106, Nimboliadda,
Hyderabad - 500027

gramabharati@gmail.com,
http://gramabharathi.org/

Ph:  
+91 9000161607 +91 - 9440417995, +91 - 9391063268, +91 - 9440282102

FCRA No: 11/210022/61 (127) - FCRA. III/Reg.No.010230493
Income Tax : ITact, F.No.DIT (E) /17/02/80 G/2013.14.

Saturday, October 22, 2016

మర్రిగూడ : నడవడికపై దృష్టి పెట్టాలి: గ్రామ భారతి యోగా శిక్షణా కార్యక్రమం

22nlg2

విద్యార్ధులు తమ నడవడికపై దృష్టి పెట్టాలని, ధనం పోతే నష్టమేమీ లేదని, ఆరోగ్యం చెడితే కొద్దిపాటి నష్టమని, వ్యక్తిత్వం పాడైతే అంతా పాడైపోయినట్లేనని అందుకు నడవడికే వ్యక్తిని నిర్మిస్తుందని సంత్‌ శ్రీ ఆచారాం బాపూజీ ఆశ్రమం శంషాబాద్‌ వక్త శ్రీశైలం అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో శనివారం గ్రామ భారతి సారధ్యంలో స్ధానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూరిభా గురుకుల పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు సుమారు 500మంది యోగాపై శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్ధి సత్య నిష్టుడు, స్నేహస్వభావం గలవాడని, సాహస పరుడని కానీ చెడు సాహసాల వల్ల చెడు వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించే సినిమాల ద్వారా నడవడిక పాడై పోతుందన్నారు. నుదిటిపై రెండు కనుబొమ్మల మధ్య ఆలోచన శక్తి కేంద్రం ఉందని, మొగులు దీనీనీ అజ్ఞాచక్రం అంటారని, శివనేత్రం, కళ్యాణకరకమగు ఆలోచనకు కేంద్రంగా కూడా చెబుతారని అన్నారు. యోగావిద్య, ఆత్మవిద్యను అభ్యసించిన వారు ఉదయం సమయంలో కొద్దిగా యోగాభ్యాసం ధ్యానంచేసి లైఖికవిద్య గొప్ప రహస్యాలను కనిపెట్టగలదన్నారు. విద్యార్ధులు తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని, దేశ భవిష్యత్‌ యువత చేతిలోనే ఉందని, ఇప్పటి నుంచే మంచి మార్గాలు ఎంచుకోవాలని విద్యార్ధులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ భారతి ఉపాధ్యక్షులు గడ్డం నర్సింహ్మ, పాల్వాయి జగత్‌రెడ్డి, మి ర్యాల రఘురాములు, మధుసూదన్‌రెడ్డి, కోచర్ల యాదగిరి, నల్ల పాండు, మోదుగు రాజేందర్‌రెడ్డి, పగడాల వెంకటేష్‌, బాలకిషన్‌, గోలి కిరణ్‌, వివిధ పాఠశాలల ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Source: http://prabhanews.com/

Friday, October 21, 2016

23న ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ: నల్లగొండ జిల్లా గ్రామభారతి

నవతెలంగాణ-నీలగిరి
నల్లగొండ జిల్లా గ్రామభారతి ఆధ్వర్యంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 23న మర్రిగూడ మండలకేంద్రంలోని ఆచార్య నాగార్జున ఆవాసంలో ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ రైతులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు గ్రామ భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి మారెడ్డిశ్రీనివాస్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకులు, గ్రామభారతి రాష్ట్ర అధ్యక్షులు సూదిని స్తంబాధ్రిరెడ్డి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి కలిగిన రైతులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు బాలస్వామి 9705734202, కిరణ్‌ 9440803834 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Source: http://www.navatelangana.com/article/nalgonda/416424

Thursday, September 1, 2016

గ్రామాన్ని మార్చిన కర్మశీలిSource http://www.jagritiweekly.com/స్పూర్తి/siddhi-nath-singh/

గ్రామాన్ని మార్చిన కర్మశీలి !
  • అంకితభావం ఆయన ఆయుధం

  • నిరంతర కృషి ఆయన మంత్రం

  • మత సామరస్యానికి ప్రతీకగా సిద్ధినాథ్‌

జార్ఖండ్‌ రాష్ట్రంలోని ”హఫువా” అనేది (రాంఘర్‌ జిల్లాలోనిది) ఒక కుగ్రామం. ఇది రాంచీకి ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి జనాభా వెయ్యి మంది. ఈ గ్రామంలో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఈ గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా యువత దేవుడిలా ఆరాధించే వ్యక్తి శ్రీ సిద్ధినాథ్‌ సింగ్‌.
ఎవరీ సిద్ధినాథ్‌? ఏమిటా కథ?
ఒకప్పుడు హఫువా గ్రామంలో యువత ఎక్కువగా నేర ప్రవృత్తిని కలిగి ఉండడానికే ఆసక్తి చూపేది. అయితే సిద్ధినాథ్‌ నిరంతర కృషి కారణంగా అక్కడ పరిస్థితే మారిపోయింది. గత రెండు దశాబ్దా లుగా ఆయన నిస్వార్థంగా చేసిన సేవ అక్కడి యువకుల జీవితాలను మార్చేసింది. అక్కడి ముస్లిం నాయకులు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులలో యువకుల పట్ల చులకన భావం మాయమైపోయింది. అక్కడి యువకులందరికీ ఇప్పుడాయన ఆరాధ్యుడే.
సిద్ధినాథ్‌ సింగ్‌ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) క్షేత్ర సంఘచాలకులు. ఈ క్షేత్రంలో బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు ఉంటాయి. వారు రాష్ట్రీయ సేవాభారతి కార్యనిర్వాహకులు కూడా. సిద్ధినాథ్‌ పట్రూటు గ్రామవాసి. ఇది కూడా రాంఘర్‌ జిల్లాలోనే ఉంది. ఆయన ”కల్పతరు” సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో గ్రామాలలో యువతకు ఉచితంగా వివిధ రంగాలకు సంబంధించి నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నారు.
సిద్ధినాథ్‌ ఇంజనీరు. అలాంటిది ఆయనలోని అంకితభావం, ఆయన చేసిన నిరంతర కృషి హఫువా గ్రామంలోని యువకుల జీవితాలను మార్చివేసింది.
రెండు దశాబ్దాలక్రితం హఫువా గ్రామం పేరు వింటే చాలు పోలీసులు, ఇంటలిజెన్స్‌ వర్గాల వారు ఉలిక్కిపడి అప్రమత్తమయ్యేవారు. రాంఘర్‌, రాంచీ పరిసరాలలో ఎక్కడ బ్యాంకు దోపిడీలు జరిగినా, మహిళల మెడలో గొలుసు దొంగతనాలు జరిగినా ముందుగా పోలీసులు హఫువా గ్రామంలోనే వాకబు చేసేవారు. పిల్లలు బడికి వెళ్ళడమనేదే లేదక్కడ. పెద్దవాళ్ళు పొలాల్లోకి వెళ్ళి పనిచేసేవారు కాదు, వాళ్ళ పేరు మీదే ఎకరాల కొద్దీ భూములు ఉన్నప్పటికీ. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోడానికి అక్కడివారు చిన్నచిన్న విషయాలకికూడా కొట్లాడుకునేవారు.
మొదట్లో వర్షపు నీటిని నిలవచేయడంపై (రెయిన్‌ వాటర్‌ స్టోరేజ్‌) పరిశోధన చేయడానికి సిద్ధినాథ్‌ హఫువా గ్రామాన్ని తరచుగా సందర్శిస్తుండే వారు. ఆ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు యువకు లైన తమ పిల్లల భవిత గురించి ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేసేవారు.
”నేను హఫువా గ్రామాన్ని పర్యటించినప్పుడు అక్కడి యువకులని కలుస్తుండేవాడిని. వాళ్ళ కళ్ళు ఎప్పుడూ మెరుస్తూండేవి. వాళ్ళ వద్ద అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటే లోపం. చదువు, సరైన మార్గదర్శనం వారికి లేదు. నేను వారిని నా సంస్థకు (కల్పతరు) ఆహ్వానించాను. అక్కడ వారికి కొంత కాలం శిక్షణ నిచ్చాను. కొద్దికాలంలోనే వారు పెద్ద పెద్ద యంత్రా లను అవలీలగా మరమ్మత్తులు చేసే సామర్థ్యాన్ని పొందారు” అంటారు సిద్ధినాథ్‌.
గత పదిహేనేళ్ళలో హఫువా గ్రామానికి చెందిన 150 మంది యువకులకు సిద్ధినాథ్‌ శిక్షణ నిచ్చారు. వారంతా ఇప్పుడు భారతదేశంలోని పలు కంపెనీ లలో, గల్ఫ్‌ దేశాలలోను మంచి జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు పాఠశాలలకు వెళ్ళి చదువు కుంటున్నారు. వాళ్ళ కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి.
అఫ్జల్‌ అలీ వయస్సు 38 సంవత్సరాలు. సిద్ధినాథ్‌ సంస్థలోనే వెల్డర్‌గా శిక్షణ పొందాడు. ఇప్పుడతడు గుజరాత్‌లోని అదానీ గ్రూప్‌లో పనిచేస్తూ నెలకి పదిహేను వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. తస్లీమ్‌ అన్సారీ ఫిట్టర్‌గా శిక్షణ పొంది రేణుకూట్‌లోని హిండాల్కో సంస్థలో పనిచేస్తున్నాడు.
హఫువా యువకులను ప్రశంసిస్తూ సిద్ధినాథ్‌ ”వారిలో మంచి ప్రతిభ, నైపుణ్యం, శక్తిసామర్థ్యా లున్నాయి. ఎలాంటి సమస్యనైనా వారు ఇట్టే పరిష్క రించగలరు. నేను చేసిందల్లా వారిలోని శక్తిని సరైన దారిలో పెట్టడమే” అంటారు. రెండు దశాబ్దాల నిరంతర కృషికి సిద్ధినాథ్‌కి దక్కిందేమిటో తెలుసా? హఫువా గ్రామ యువకులలో ఆయన పట్ల భక్తిభావం.
”హఫువా గ్రామంలో గత పదేళ్ళలో ఒక్క క్రిమినల్‌ కేసు కూడా నమోదు కాలేదు” అంటారు జుబాయిర్‌ అహ్మద్‌. ఈయన ”కల్పతరు” ద్వారా సిద్ధినాథ్‌తో గత పన్నెండేళ్ళుగా సన్నిహితంగా పనిచేస్తున్నారు.
జానిసర్‌ అన్సారీ సరస్వతీ విద్యామందిర్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. అతడికి సిద్ధినాథ్‌ దేవుడితో సమానం. ”నా ఖర్చులన్నీ ఆయనే చూసుకుంటారు. నేను ఐఐటి ప్రవేశ పరీక్షలో విజయం సాధించి మా గ్రామం నుంచి మొట్టమొదటి ఇంజనీరుని కావాలనుకుంటున్నాను” అని అన్నాడు.
లాల్‌ మహమ్మద్‌ అన్సారీ ఒక భూస్వామి. అతని ఐదుగురు పిల్లలూ సిద్ధినాథ్‌ వద్ద చదువుకున్నారు. ”దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోతోందని కొందరు భావిస్తున్నప్పుడు సిద్ధినాథ్‌ మత సామరస్యా నికి ప్రతీకగా నిలిచారు” అని అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ని ఒక మతోన్మాద సంస్థగా ప్రచారం చేసేవారికి సిద్ధినాథ్‌ ఉదాహరణ ఒక గట్టి సమాధానమని హఫువా గ్రామస్థులు అంటారు. సిద్ధినాథ్‌ హఫువా గ్రామంలో రెండు దశాబ్దాల పాటు విశేషంగా కృషి చేసారు. అయినా వారి కృషి గురించి, వారిద్వారా ఆ గ్రామంలో చోటుచేసు కుంటున్న పరిణామాల గురించి ఏనాడూ, ఏ పత్రిక లోనూ రాలేదు. ఇది వారి ప్రచార విముఖతకు నిదర్శనం. ఎందుకంటే ఆయన సంఘ సుశిక్షితుడైన స్వయంసేవక్‌.
విశేషమేమిటంటే ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న హఫువా గ్రామంలో వారి మధ్యనే ఉంటూ గత రెండు దశాబ్దాలుగా సిద్ధినాథ్‌ పనిచేస్తున్నా ఏనాడూ వారెవరినీ మతం మార్చుకోమని అడగలేదు. అక్కడ ఒక్క మతమార్పిడి చర్య కూడా జరగలేదు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకలాపాలు మత సామరస్యానికి విఘాతం కలిగించవని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇదీ హిందుత్వం విశిష్టత! సంఘకార్యం గొప్పదనం!
– దుగ్గిరాల రాజకిశోర్‌, 8008264690

Sunday, August 28, 2016

లావణ్య ఒక ఆదర్శ రైతు

లావణ్య ఒక ఆదర్శ రైతు
మహిళారైతు భూదేవి-3
 
పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రసాయన ఎరువులు వాడకుండా మిర్చి, పత్తి, చిరుధాన్యాలను పండిస్తూ, అధిక దిగుబడులను పొందుతున్నారు లావణ్య. సుభాష్ పాలేకర్ ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’లో... ‘గ్రామభారతి’ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో ఆమె శిక్షణ పొందారు. తను ఇదే పద్ధతిలో వ్యవసాయం చేస్తూ, జిల్లాలోని ఇతర రైతులకూ సలహాలు అందిస్తున్నారు. గ్రామభారతి ఆధ్వర్యంలో జరిగే ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులలో కూడా లావణ్య తన అనుభవాలను వివరిస్తూ జిల్లాలో అనేకమంది ఈ మార్గంలో రావడానికి తోడ్పడుతున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు గడించవచ్చునని నిరూపిస్తూ, మిర్చి పంటను ఒక ఎకరాలో 80 క్వింటాళ్లు పండించి వ్యవసాయ మంత్రి, అధికారుల ప్రశంసలు అందుకున్నారు.

నిత్యం వ్యవసాయ పనులలో నిమగ్నమైనప్పటికి  స్వగ్రామమైన ‘కార్వంగ’ (తెల్కపల్లి మండలం, మహబూబ్‌నగర్ జిల్లా) లో గ్రామభారతి ఆధ్వర్యంలో నడిచే పదవతరగతి విద్యారుల స్టడీసెంటర్‌ను పర్యవేక్షిస్తున్నారు.  రాష్ట్రంలో అనేక మంది రైతులు లావణ్య సాగుచేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తూ, ఆమె సలహాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ, రసాయన రహిత ఆహారం అందిస్తూ, సమాజంలో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ  లావణ్య ఒక ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు.  

Source http://www.sakshi.com/news/family/woman-march-8-awards-213930

Monday, August 22, 2016

సూదిని స్తంభాద్రిరెడ్డి: ప్రకృతి రైతుల గుండెల్లో ప్రాణస్పందనై నిలబడ్డాడు.

తన స్వార్ధం కోసం బతికేవాడు ఒక జీవితకాలమే బతుకుతాడు. పదిమంది గురించి ఆలోచించే వాడు పదికాలాల పాటు జీవిస్తాడు. ఆయన ప్రకృతి గురించి, అన్నదాత గురించి ఆలోచించగలిగాడు కాబట్టే, ఇవాళ ప్రకృతి రైతుల గుండెల్లో ప్రాణస్పందనై నిలబడ్డాడు.
farmer-the-best
సూదిని స్తంభాద్రిరెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టడంతో సహజంగా వ్యవసాయంపైనే తనకు ఆసక్తి కలిగింది. చేస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయం చేయాలని భావించాడు. కొంతకాలం రసాయన వ్యవసాయం చేసి దానిలోని కష్టనష్టాలను అనుభవించాడు. వాటిలో పెట్టుబడులే తప్ప దిగుబడులు, లాభాలు అన్నమాటే కన్పించలేదు. ఇక రైతులను రసాయనిక వ్యవసాయపు విషపు కోరల్లోంచి రక్షించాలన్న భావనతో మళ్ళీ ఉద్యోగంలో చేరి వారిని క్రమంగా ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యవంతుల్ని చేయడం ఆరంభించాడు.

ఉద్యోగ విరమణ తరువాత స్తంభాద్రిరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గులలోని తన 9 ఎకరాల పొలంలో ప్రకృతి విధానంలో వివిధ రకాల పంటల సాగు మొదలుపెట్టాడు. మామిడి ఐదున్నర ఎకరాలు, వరి ఒకటిన్నర ఎకరాలు, పత్తి ఎకరంన్నర, దీనిలో అంతర పంటగా కంది, వీటితోపాటు బత్తాయి, మునగ, జామ, సీతాఫలం వంటి పంటల సాగు చేశాడు. తనకున్న ఈ వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే కొనసాగించాడు. ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గిపోయింది. దీంతో ఆయన నికరాదాయం పెరగడమే కాక భూసారమూ మెరుగయింది. 
farmer-the-best2
రసాయనిక ఎరువులైన రియా, డిఏపి స్థానంలో దేశీ ఆవుపేడ, మూత్రంతో తయారుచేసిన ఘన జీవామృతం, ద్రవ జీవామృతంలను పంటలకు అందివ్వడం వల్ల అవి ఏపుగా పెరిగాయి. మామిడి, జామ, నేరేడు, వరి, పత్తి, కంది లాంటి పంటల్లోనూ ఇదే పద్ధతి చేపట్టి సత్ఫలితాలు సాధించాడు. 2015లో మామిడిలో 3 ఎకరాలకు గాను 5 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది అనూహ్య వాతావరణ పరిస్థితులలోను జీవామృతంతో మామిడిలో కొంత దిగుబడి సాధించాడు. గత ఖరీఫ్‌లో అర ఎకరంలో తెలంగాణ సోనా 18 బస్తాలు పండించాడు. అర ఎకరం పత్తిలో 3 క్వింటాళ్ల పత్తి పండించాడు. ఇక్కడ దిగుబడి కన్నా తక్కువ పెట్టుబడి, పర్యావరణ హితమే ప్రధానమంటాడు స్తంభాద్రిరెడ్డి.
farmer-the-best3
జీరో బడ్జెట్ ఫార్మింగ్ ద్వారా పెట్టుబడి విషయంలో భూమాత ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించటం తద్వారా జనుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రధాన విషయం. దీనివల్ల రైతుకు సంతోషమే గాక, దీనిలో జాతీయ దృక్పథమూ ఉంది. మనం దిగుమతి చేసుకునే రసాయన ఎరువులు, పురుగుమందులకు చరమగీతం పాడితే కొన్ని లక్షలకోట్ల సంపద ఆదా అవుతుంది. వీటి వినియోగంతో రకరకాల సూక్ష్మపోషక లోపాలు రావడంతో పునరాలోచనలో పడ్డాడు. అలా బహుళ పంటల సాగు విధానం అదృశ్యమై వాణిజ్య పంటలు, ఏకపంట విధానాలు ప్రత్యక్షమైనాయి. మొత్తం మీద ఈ పద్ధతులు ఉత్పత్తిదారులైన రైతులను వినియోగదారులుగా మార్చివేశాయి. అందుకే రైతులు పలు పంటల విధానాన్ని చేపట్టి మన జాతి గర్వించదగ్గ గోమాతను రక్షించుకొని తమ దిశను మార్చుకోవలసిన అవసరం ఉంది. 

మన దశ తిరగాలంటే దిశ మారాలని అంటాడు స్తంభాద్రిరెడ్డి. ఆయన పాడి-పంటలు వ్యవసాయ మాసపత్రికకు ప్రతినిధిగా పనిచేసే సమయంలోనే తన భావాలకు అనుకూలమైన గ్రామభారతి సంస్థతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఆయనకు మొదటినుంచీ పల్లెలంటే ప్రేమ, వ్యవసాయం అంటే ప్రాణం. గ్రామభారతి సంస్ధ లక్ష్యం కూడా అదే. పల్లెసీమలు పచ్చగుండాలనేది దాని స్వప్నం. పదవీ విరమణ తర్వాత స్తంభాద్రిరెడ్డికి ప్రకృతి వ్యవసాయంలోని సాధ్యాసాధ్యాలను తోటి రైతులకు తెలియజేయాలనే సంకల్పం నెరవేర్చుకోవటానికి సరైన దిశ దొరికింది. 
list006
పాశ్చాత్య సంస్కృతి, రాజకీయ పార్టీల విషాలు పల్లెల జీవన విధానాన్ని నాశనం చేశాయి. దానికి ఇంగ్లీష్ విద్యావిధానం మనిషిని సంపదకు బానిసను చేసింది. ఫలితంగా గ్రామాలు పట్టణాలకు వలసపోయాయి. పర్యావరణాన్ని పశుసంపదను నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వనసంపద, జలసంపద, జంతుసంపద కనుమరుగయ్యే ప్రమాదం తలెత్తింది. ప్రకృతి రైతుగా సాటి రైతులకు ఏదో చేయాలనే లక్ష్యంతో, రైతుల దిశను మార్చే విధంగా ఉపకరించాలనే ఆలోచనలతో ఉన్నప్పుడు తిరుపతిలో జరిగిన పాలేకర్ సమావేశం ఆయనలో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. ఒక్క ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం సాధ్యం అవుతుందన్న విషయాన్ని వెంటనే నమ్మలేక స్వంత పొలంలోనే పరీక్షించి ఇది ఆచరణ సాధ్యమని, సులువైందని, ఎవరైనా చేయవచ్చని భావించాడు. 

తన అనుభవాన్ని రైతులకు పంచాలని గ్రామభారతి సంస్థ ద్వారా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టి దాదాపు దశాబ్దకాలంగా సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాడు. యువతరాన్ని వ్యవసాయానికి దగ్గర చేయాలన్న లక్ష్యంతో 2015 నవంబర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సుభాష్ పాలేకర్‌తో వర్క్‌షాప్‌ను నిర్వహించాడు. ప్రస్తుతం గ్రామగ్రామాన ప్రకృతి వ్యవసాయ సదస్సులు నిర్వహించి రైతులను ఆ దిశగా మళ్లిస్తున్నాడు. తాను ఒక్కడినే కాదు, ప్రతీ రైతు మోమున చిరునవ్వు విరియాలనే సంకల్పంతో స్తంభాద్రిరెడ్డి ముందడుగు వేస్తున్నాడు. 
రైతు చిరునామా: స్తంభాద్రిరెడ్డి, నర్సాయపల్లి, మాడుగుల, మహబూబ్‌నగర్ జిల్లా
- కె. క్రాంతికుమార్‌రెడ్డి
వ్యాసకర్త ఇ-మెయిల్: KRANTIKUMARREDDY.K@GMAIL.COM

Source: http://www.namasthetelangaana.com/